బైకుతో చెట్టును ఢీకొట్టిన టెన్త్ విద్యార్థులు.. ముగ్గురు మృతి

V6 Velugu Posted on Mar 21, 2021

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. నర్పీపట్నానికి చెందిన సహాడి వర్షిత్, పాటి అనిల్ కుమార్, రుత్తల సాయి అనే ముగ్గురు విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు శనివారం రాత్రి బైక్ మీద బయటకు వెళ్లారు. మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్దకు రాగానే.. బైక్ అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. దాంతో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా.. ఒక విద్యార్థి ప్రమాదస్థలిలోనే మృతిచెందాడు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. ఒక విద్యార్థి నర్సీపట్నం ఆస్పత్రిలో మరణించాడు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. పిల్లలు చనిపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర కన్నీటిపర్యంతమవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
 

Tagged andhrapradesh, Bike Accident, 10th class students, Vishakapatnam

Latest Videos

Subscribe Now

More News