వంగూరు/మానవపాడు, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర జడ్పీ హైస్కూల్ లో టెన్త్ చదువుతున్న డి.శివకృష్ణ తండ్రి ఆదివారం రాత్రి అనారోగ్యంతో చనిపోయాడు. సోమవారం ఎగ్జామ్ ఉండడంతో కన్నీళ్లను దిగమింగుతూ పరీక్షకు హాజరయ్యాడు. ఎగ్జామ్ రాసి వచ్చాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
అలాగే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన కరీం ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో చనిపోయాడు. అతని కొడుకు సమీర్ పుట్టెడు దు:ఖంలోనూ టెన్త్ ఎగ్జామ్ కు హాజరయ్యాడు. పరీక్ష రాసి వచ్చాక అంత్యక్రియలు నిర్వహించారు.
