10 th calss : టెన్త్ ఎగ్జామ్స్ పై మంత్రి కీలక ఆదేశాలు

10 th calss : టెన్త్ ఎగ్జామ్స్ పై మంత్రి కీలక ఆదేశాలు

 ఏప్రిల్ 3 నుంచి జరగనున్న టెన్త్ ఎగ్జామ్స్  పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిన ఆమె.. మార్చి 24 నుంచి వెబ్ సైట్లలో  హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. 4.94 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు.

ఎగ్జామ్స్ కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఏప్రిల్ 3 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు పరీక్షలు  నిర్వహిస్తున్నామని.. విద్యార్థులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.