టెర్రా నుంచి ఈ–ఆటో.. ఒక్కసారి ఛార్జింగ్ తో 200 కిలోమీటర్ల మైలేజ్

టెర్రా నుంచి ఈ–ఆటో.. ఒక్కసారి ఛార్జింగ్ తో 200 కిలోమీటర్ల మైలేజ్

హైదరాబాద్​, వెలుగు:జపాన్​ ఈవీ తయారీ సంస్థ టెర్రా మోటార్స్​ తెలంగాణలో క్యోరో ఎలక్ట్రిక్​ త్రీ-వీలర్​ను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈవీ పాలసీ కింద ప్రత్యేక డీలర్‌‌‌‌‌‌‌‌షిప్,​ డిస్ట్రిబ్యూటర్​ భాగస్వామ్యాల కోసం ఈ సంస్థ చూస్తోంది.  

2026 డిసెంబర్​ వరకు రోడ్​ ట్యాక్స్​, రిజిస్ట్రేషన్​ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపు ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రకటన త్రీ-వీలర్ల కంపెనీలకు మేలు చేస్తుందని తెలిపింది. క్యోరో ఆటో గంటకు 55 కి.మీ స్పీడుతో వెళ్తుంది. ఒక్కసారి చార్జింగ్​తో 200 కి.మీ వరకు మైలేజీ ఇస్తుంది.