ట్రక్కును ఢీకొట్టిన రైలు.. భయంకరమైన దృశ్యాల వీడియో వైరల్

ట్రక్కును ఢీకొట్టిన రైలు.. భయంకరమైన దృశ్యాల వీడియో వైరల్

ఇండోనేషియాలోని సెమరాంగ్ నగరంలో పెద్ద రైలుప్రమాదానికి ప్రమాదం చోటు చేసుకుంది. అక్టోబర్ 21న రాత్రి 10 గంటల ప్రాంతంలో రైలు పట్టాలపై చిక్కుకున్న ఓ ట్రక్కును హరినా రైలు ఢీకొట్టిన సంఘటన కెమెరాలో రికార్డయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో..అత్యంత వేగంగా వస్తున్న లోకోమోటివ్ ట్రక్కును ఢీకొట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పదే పదే హారన్ మోగిస్తున్నప్పటికీ ట్రక్కు పట్టాలపై ఉండటంతో ఢీకొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. రైలు వేగంగా ఢీకొట్టడంతో ట్రక్కు భాగాలు వందల మీటర్లు దూరంలో ఎగిరి పడ్డాయి. ఇది జనం భయంతో పరుగులు పెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది.

స్థానిక మీడియా సమాచారం ప్రకారం..ట్రక్కు డ్రైవర్ రైల్వే పట్టాలను దాటే ప్రయత్నంలో ఇరుక్కుపోయాడు. ఢీకొనడానికి కొన్ని క్షణాల ముందే డ్రైవర్ సురక్షితంగా బయటపడడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.ఘటన తరువాత సెమరాంగ్ నుండి సురబయకు వెళ్తున్న హరినా రైలు కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. రైలు ,ట్రక్కు రెండూ దెబ్బతిన్నాయి. స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

ఈ ఘటనతో రైల్వే క్రాసింగ్ భద్రతా చర్యలపై మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.