ప్రాణాలు అర్పించి కశ్మీరీని కాపాడిన సైనికుడు : టెర్రరిస్టులు హతం

ప్రాణాలు అర్పించి కశ్మీరీని కాపాడిన సైనికుడు : టెర్రరిస్టులు హతం

జమ్ములో ఈ ఉదయం మొదలైన ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల టెర్రర్ హంట్ ముగిసింది. 8గంటల పాటు టెన్షన్ రేపిన ఎన్ కౌంటర్ లో తమ ప్రాణాలకు తెగించి. స్థానికుల ప్రాణాలు కాపాడింది సైన్యం. ఉగ్రవాదులు బంధించిన స్థానికుడిని ప్రాణాలతో కాపాడారు. ముగ్గురు ఉగ్రవాదులను లేపేశారు. ఈ ప్రయత్నంలో ఓ ఆర్మీ జవాన్ అమరుడయ్యారు.

రాంబన్ జిల్లా బటోట్ మార్కెట్ ఏరియాలో ఈ ఉదయం అలజడి రేగింది. సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు కశ్మీర్ పోలీసుల సహాయంతో.. నిర్బంధ తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో దొరికిపోతామన్న భయంతో ముగ్గురు ఉగ్రవాదులు.. బలగాలపైకి కాల్పులు జరిపారు. వారిపై ఎదురుకాల్పులు జరిపిన సైనికులు తరుముకుంటూ వెళ్లారు.

పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులు.. ఓ ఇంట్లోకి దూరి.. అందులో ఒకతడిని బందీగా పట్టుకుని.. మిగతావారిని బయటకు పంపించేశారు. ఆ భవనాన్ని సైనికులు చుట్టుముట్టారు. అత్యంత పకడ్బందీగా జరిగిన ఆపరేషన్ లో… టెర్రరిస్టుల చేతిలో బందీగా ఉన్న స్థానిక కశ్మీరీకి ఎటువంటి గాయాలు కాకుండా పోలీసులు కాపాడారు. అత్యంత జాగ్రత్తగా జరిపిన ఆపరేషన్ లో ఆ టెర్రరిస్టులను మట్టుపెట్టారు. ఈ కీలక ఆపరేషన్ లో.. ఓ సైనికుడు తన ప్రాణాలు కోల్పోయారు.

టెర్రర్ హంట్ ఆపరేషన్ వివరాలను జమ్ము ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకేశ్ సింగ్ మీడియాకు వివరించారు. బటోట్ లో ఉగ్రవేట ముగిసిందన్నారు. ఒక సోల్జర్ చనిపోయాడని.. మరో ఇద్దరు పోలీసులకు బుల్లెట్ గాయాలు తగిలాయని ఆయన చెప్పారు. ఉగ్రవాదులను చంపేయడంతో.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.