
ఈ నెల నాలుగో తేదీన CRPF జవాన్లపై కాల్పులు జరిగిన ఉగ్రవాదులను మట్టుపెట్టామన్నారు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్. ఉగ్రవాదులంతా పాకిస్తాన్ కు చెందిన వారిగా గుర్తించామన్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదం క్రమంగా తగ్గుతోందన్నారు. పాక్ నుంచి దేశంలోకి చొరబడుతున్న మిలిటెంట్లు.. భద్రతా బలగాలపై దాడి చేస్తున్నారని వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు.