స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ.. నిఘా వర్గాల హెచ్చరికలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ.. నిఘా వర్గాల హెచ్చరికలు

ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు జారీ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ తీవ్రవాద గ్రూపులు ఉగ్రదాడి చేసే అవకాశం ఉందని ఐబీ 10 పేజీల నివేదికను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎర్రకోటలో ప్రవేశ నిబంధనలను కఠినతరం చేయాలని ఐబీ ఢిల్లీ పోలీసులకు సూచించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దాడి, ఉదయపూర్, అమరావతిలో జరిగిన ఘటనలను నివేదికలో ప్రస్తావించిన ఐబీ... అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. 

రాడికల్ గ్రూపులపై, రద్దీ ప్రదేశాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని ఇంటలిజెన్స్ వర్గాల సూచించాయి. పెద్ద నాయకులు, ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. ఢిల్లీలోని రోహింగ్యాలు, ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ సూడాన్ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలపై కఠినమైన పర్యవేక్షణ ఉంచాలని ఇంటలిజెన్స్ తన నివేదికలో పేర్కొంది. టిఫిన్ బాంబు, స్టిక్కీ బాంబు, వీవీఐడీలు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఐబీ అప్రమత్తం చేసింది.