తీహార్ జైల్లో కేజ్రీవాల్ సెల్ చుట్టూ వాళ్లే... ఆ క్రిమినల్స్ పేర్లు వింటేనే వణుకు

తీహార్ జైల్లో కేజ్రీవాల్ సెల్ చుట్టూ వాళ్లే... ఆ క్రిమినల్స్ పేర్లు వింటేనే వణుకు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు రెండు వారాల పాటు జుడిషియల్ కస్టడీ విధించింది. అయితే సోమవారం రాత్రి నుంచి కేజ్రీవాల్ ను తీహార్ జైల్లో సెల్ 2లో ఉంచారు.  పెద్దపెద్ద క్రిమినల్స్ ఉన్న పక్క సెల్ లోనే అరవింద్ కేజ్రీవాల్ ను ఉంచారు.  అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా, ఉగ్రవాది జియావుర్ రెహ్మాన్ కేజ్రీవాల్ చుట్టు ఉన్న సెల్స్‌లో ఉన్నారు. కేజ్రీవాల్ మరో రెండు వారాలపాటు అక్కడే ఉండనున్నారు. 

ఛోటా రాజన్ ఒకప్పుడు దావూద్ ఇబ్రహీంకు వ్యతిరేకంగా మారడానికి ముందు సన్నీహితుడే. నీరజ్ బవానా ఒక పేరుమోసిన గ్యాంగ్‌స్టర్, అతనిపై 40కి పైగా హత్య, హత్యాయత్నం మరియు దోపిడీ కేసులు ఉన్నాయి. జియావుర్ రెహ్మాన్ ఇండియన్ ముజాహిదీన్ (IM) కార్యకర్త. వీరు ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో వీరు గదులు కేజ్రీవాల్ కు దగ్గర్లో ఉన్నాయి. ఇదే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడయా సెల్ నెంబర్ 1, కల్వకుంట్ల కవిత లేడీస్ సెక్షన్ లోని 6 నెంబర్ సెల్ లో ఉన్నారు. కేజ్రీవాల్ ఉన్న గదిలో 24గంటలు నిఘా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.