పాక్ సాయంతో భారత్‌లోకి టెర్రరిస్టు.. ఆర్మీ ఎదుట లొంగుబాటు

పాక్ సాయంతో భారత్‌లోకి టెర్రరిస్టు.. ఆర్మీ ఎదుట లొంగుబాటు

ఉరీ: లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ టెర్రరిస్టు ఆర్మీ ఎదుట లొంగిపోయాడు. పాకిస్థాన్‌ పంజాబ్‌లోని ఒఖారాకు చెందిన అలీ బాబర్ పాత్రా అనే ఆ టెర్రరిస్టు.. జమ్మూ కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో భద్రతా దళాల ముందు లొంగిపోయాడు. ఈ విషయంపై లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే స్పందించారు. పాక్ మిలటరీ కమాండర్ల సాయంతో టెర్రరిస్టులు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడుతున్నారని డీపీ పాండే అన్నారు. గత నెల రోజుల్లో పాక్ వైపు నుంచి అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయని చెప్పారు. అయితే టెర్రరిస్టులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారిని మన భూభాగంలోకి రాకుండా విజయవంతంగా అడ్డుకుంటున్నామని తెలిపారు.  గడిచిన ఏడ్రోజుల్లో ఏడుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు. ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో అన్ని వైపుల నుంచి భద్రతా దళాలు చుట్టుముట్టడంతో అలీ బాబర్ పాత్రా అనే టెర్రరిస్టు లొంగిపోయాడని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

ఆత్మగౌరవ ఎన్నికలు.. పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ కావొద్దు

పక్కా ప్లాన్‌తోనే మారణకాండ.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు

పంతం నెగ్గించుకున్న కెప్టెన్.. సిద్ధూ రాజీనామా