ఆత్మగౌరవ ఎన్నికలు.. పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ కావొద్దు

V6 Velugu Posted on Sep 28, 2021

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో గెలుపుపై ప్రముఖ హీరో మంచు విష్ణు ధీమా వ్యక్తం చేశారు.  వచ్చే నెల10న జరగనున్న ‘మా’ ఎలక్షన్స్‌లో తమ ప్యానెల్ నెగ్గుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నామని చెప్పారు. ప్యానెల్ సభ్యులందరమూ కలసి మంగళవారం నామినేషన్లు దాఖలు చేశామని విష్ణు తెలిపారు. ఇది ప్రతి తెలుగు నటుడి ఆత్మ గౌరవ పోరాటమన్నారు. 

‘ఈ ఎన్నికల్లో పొలిటికల్ పార్టీలు జోక్యం చేసుకోవద్దు. నాకు 900 మంది సభ్యుల మద్దతు ఉంది.  నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా నాకే ఓటు వేస్తారు. పవన్‌‌ వ్యాఖ్యలపై నాన్న గారు మాట్లాడతారు. ఇండస్ట్రీ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏకీభవించడం లేదు. ఈ విషయంలో పవన్‌తో నేను ఏకీభవించడం లేదు. పవన్ కామెంట్లపై ఫిలిం ఛాంబర్ ఇచ్చిన లేఖతో నేను ఏకీభవిస్తున్నా. మరి ప్రకాశ్ రాజ్ ఎవరి వైపు ఉన్నారో చెప్పాలి. పవన్ కల్యాణ్ వైపు ఉంటారా? ఇండస్ట్రీ వైపు క్లారిటీ ఇవ్వాలి.  

మరిన్ని వార్తల కోసం: 

పక్కా ప్లాన్‌తోనే మారణకాండ.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు

పంతం నెగ్గించుకున్న కెప్టెన్.. సిద్ధూ రాజీనామా

పింఛన్ రావాలంటే ఇంటిమీద గులాబీ జెండా పెట్టుకోవాలట

Tagged Pavan kalyan, Chiranjeevi, Mohan Babu, Prakash Raj, Cm Jagan Mohan Reddy, Maa Elections, movie artists association, Actor Manchu Vishnu

Latest Videos

Subscribe Now

More News