ఉగ్రవాదుల కాల్పులు..ఇద్దరు జవాన్లకు గాయాలు

ఉగ్రవాదుల కాల్పులు..ఇద్దరు జవాన్లకు గాయాలు

కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సోపియాన్ ఏరియాలో కాల్పులకు తెగ బడుతున్నారు. కూంబింగ్ జరుపుతున్న భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులు జరుగుతున్న ప్రాంతానికి భారీగా అదనపు బలగాలను తరలించారు అధికారులు. గురువారం సోపియాన్  లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.