రిలయన్స్​తో టెస్లా జోడీ .. ఎలక్ట్రిక్​ కార్ల ప్లాంటు కోసమే జేవీ ఏర్పాటు చేసే చాన్స్

రిలయన్స్​తో టెస్లా జోడీ .. ఎలక్ట్రిక్​ కార్ల ప్లాంటు కోసమే జేవీ ఏర్పాటు చేసే చాన్స్

న్యూఢిల్లీ: టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలను మొదలుపెట్టడానికి రిలయన్స్​తో చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలసి దేశంలో ఫ్యాక్టరీని నిర్మించడానికి జాయింట్ వెంచర్ కోసం చర్చలు జరుపుతున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, నెల రోజులుగా ఇవి జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపారు. 

ఈ చర్యను ఆటోమొబైల్ రంగంలోకి రిలయన్స్​ ప్రవేశించినట్లు భావించరాదని, రిలయన్స్ లక్ష్యం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సామర్థ్యాలను నిర్మించడం మాత్రమేనని ఆయన వివరించారు. రిలయన్స్​ గత ఏడాది అశోక్ లేలాండ్ భాగస్వామ్యంతో, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత భారీ-డ్యూటీ ట్రక్కును ప్రారంభించింది.  జేవీ ఏర్పాటు గురించి రిలయన్స్​కు, ఇండస్ట్రీస్  టెస్లాకు పంపిన ఈ–మెయిల్​కు సమాధానం రాలేదు.

 22న మోదీతో మస్క్​భేటీ

 మస్క్ ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి మనదేశం రాబోతున్నారు.  ఇక్కడ టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రణాళికలపై ప్రకటన చేస్తారని సమాచారం. మస్క్,  మోదీ చివరిసారిగా గత జూన్‌లో న్యూయార్క్‌లో కలుసుకున్నారు.  టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి పన్నులను తగ్గించాలని  ఈ కంపెనీ భారత్‌లో లాబీయింగ్ చేసింది. తయారీదారులు కనీసం 500 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తే కొన్ని మోడళ్లపై దిగుమతి పన్నులను తగ్గిస్తామని కేంద్రం ప్రకటించింది