Elon Musk: నేను డ్రగ్స్​తీసుకోవడం లేదు..జస్ట్​ ప్రయత్నించాను అంతే:ఎలాన్ మస్క్​

Elon Musk: నేను డ్రగ్స్​తీసుకోవడం లేదు..జస్ట్​ ప్రయత్నించాను అంతే:ఎలాన్ మస్క్​

ప్రపంచ బిలియనీర్..టెస్లా సీఈవో..ఎలాన్ మస్క్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఎలాన్​ మస్క్​ డ్రగ్స్ ఇప్పటీకీ వాడుతున్నాడు.. అది ఆయన ఆరోగ్యంతో పాటు వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అటు టెస్లా, స్పేస్ ఎక్స్​ లోని బోర్డులు, ఇటు అమెరికన్​ పత్రికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎలాన్​ మస్క్​ మాత్రం డ్రగ్స్​వాడకంపై ఇలా స్పందించాడు. 

గత కొంత కాలంగా తనపై వస్తున్న డ్రగ్స్ వాడకం ఆరోపణలను ఎలాన్ మస్క్ ఖండించారు. న్యూయార్క్​ టైమ్స్​ లాంటి పత్రికల్లో వచ్చిన కథనాలను తోసిపుచ్చారు. తాను కొన్నేళ్ల క్రితం మానసిక ఆరోగ్యంకోసం ప్రిస్ర్కిప్షన్​ కెటామైన వాడినట్టు మస్క్​ ఒప్పుకున్నారు. అయితే ప్రస్తుతం తాను డ్రగ్స్​ తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. రోజూ వాడితో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని డ్రగ్స్​ తీసుకోవడం లేదని చెప్పారు. 

Given Elon Musk’s business track record, any drugs he’s taking should be put in the public’s drinking water.

— Whole Mars Catalog (@WholeMarsBlog) May 31, 2025

టెక్​ బిలియనీర్ దాదాపు 20 రకాల డ్రగ్స్​ ఉన్న డైలీ పిల్ బాక్స్​ ను తన వెంట తీసుకెళ్తున్నాడని,ఇది అతని మూత్రాశయంపై ప్రభావం చూపుతుందని న్యూయార్క్​ టైం హైలైట్​ చేసింది. ఎలాన్​ మస్క్​తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. సోషల్​మీడియా ప్లాట్​ ఫాం Xలో ఈ ఆరోపణలను ఖండించారు. ‘‘నేను డ్రగ్స్​ తీసుకోవడం లేదు, న్యూయార్క్​ టైమ్ వారి గాడిద చెప్పింది అబద్ధం అని .. తాను కొన్నేళ్ల క్రితం మానసిక ఆరోగ్యం కోసం ప్రిస్ర్కిప్షన్​కెటామెన్​ తీసుకున్నానని వెల్లడించారు. 

ALSO READ | మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్..ఓ జపనీస్ పాప్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పెర్మ్ డొనేట్!

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే “నేను డ్రగ్స్​ తీసుకోవడం లేదు.. న్యూయార్క్​ టైమ్స్​ రాతలు ఆశ్చర్యపర్చాయి.కొన్నేళ్ల క్రితం కెటామైన్​ ప్రయత్నించాను. అది మానసిక ఆందోళననుంచి బయటపడేందుకు మాత్రమే..కానీ ఇప్పుడు తీసుకోవడం లేదు అని X లో పోస్ట్​ చేశారు. 

శుక్రవారం వైట్​ హౌజ్​ లో డొనాల్డ్​ ట్రంప్​ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి  బ్లాక్​ ఐతో వచ్చిన మస్క్..డ్రగ్స్​ వాడకంపై విలేకరులు ప్రశ్నలు అడగకుండా తప్పించుకునేలా చేసింది. డ్రగ్స్​ వాడకం కంటే బ్లాక్​ ఐ ఇటు విలేకరులను, అటు ప్రజల దృష్టిని ఆకర్షించింది. గాయం గురించి అడిగినప్పుడు..తన చిన్న కొడుకు ఎక్స్​ తో ఆడుతున్నప్పుడు గాయమైందని మస్క్​ చెప్పాడు. ముఖంపై కొట్టమని చెప్పాను. వాడు నిజంగానే కొట్టాడని కొంచెం అనుమానంగా చెప్పారు. 

ఎలాన్​ మస్క్​ డ్రగ్స్​ వాడుతున్నట్లు చూపించే సంఘటనలు చాలానే ఉన్నాయి. 2018లో లాస్ ఏంజిల్స్ జరిగి పార్టీలో మస్క్ డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019లో మెక్సికో పార్టీ, 2021లో మియామిలోని ఆర్ట్​ బాసెల్ హౌజ్​ పార్టీలో అతని సోదరుడు కింబాల్​ మస్క్ తో కలిసి డ్రగ్స్​ సేవించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో స్పేస్ ఎక్స్ బోర్డు సభ్యుడిగా ఉన్న స్టీవ్​ జుర్వెటి సన్ తో కలిసి మాస్క్ డ్రగ్స్​ సేవించినట్లు తెలుస్తోంది. 

ఎలాన్​ మస్క్ వింత ప్రవర్తన అతడిపై వస్తున్న డ్రగ్స్​ వాడకం ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నాయి. గతంలో టెస్లా మాజీ డైరెక్టర్​ లిండా జాన్సన్​ రైజ్​పై డ్రగ్స్​ ప్రభావంతో కోపంతో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో ఆమె కంపెనీ బోర్డునుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మస్క్​ అటార్నీ ఖండించారు. స్పేస్​ ఎక్స్​ లో మస్క్​కు ఎప్పటికప్పుడు డ్రగ్స్​ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వీటిలో అతను ఎప్పుడూ విఫలం కాలేదని చెబుతున్నారు.