టెట్ ఫలితాల వెల్లడికి ముహూర్తం ఖరారు

టెట్ ఫలితాల వెల్లడికి ముహూర్తం ఖరారు

టెట్ ఫలితాల ప్రకటనకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. జులై 1న టెట్ ఫలితాలు వెలువడనున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరును సమీక్షించిన అనంతరం మాట్లాడిన మంత్రి సబిత టెట్ ఫలితాలను జులై 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

వాస్తవానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలోనే జూన్ 27న టెట్ ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా జూన్ 27న ఫలితాల కోసం ఆశగా ఎదురుచూసిననా ఫలితం లేకుండాపోయింది. టెట్ ఫైనల్ కీ విడుదలలో జాప్యం ఫలితాల వెల్లడిలో ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించగా.. పేపర్ 1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు.