హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ఈ నెల10 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ స్టేట్ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్) 2025 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 11,14,17 తేదీల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు టీజీ సెట్ అధికారులు తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి 12 వరకు ఈ ఎగ్జామ్స్ ను మూడు రోజుల పాటు నిర్వహించాల్సి ఉంది. కాగా, పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. రెగ్యులర్ అప్ డేట్స్ కోసం అభ్యర్థులు www.osmania.ac.in లేదా www.telanganaset.org వెబ్ సైట్ చూడాలని సూచించారు.
