- కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో మొదటి, రెండో విడతలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ దేవ సహాయంతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల్లో 6 మండలాల్లోని 1,326 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు 3,502 మంది పీవో, ఓపీవో సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
7 మండలాల్లో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించి 1,412 పోలింగ్ కేంద్రాలకు 4,106 మందిని ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలను కేటాయించామని పేర్కొన్నారు.
