ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
  • కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు : ఎయిడ్స్‌‌‌‌ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం హెచ్ఐవీ బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్‌‌‌‌ వ్యాధి పట్ల ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మల్లికార్జున్, వైద్య సిబ్బంది  పాల్గొన్నారు.