ఐపీఎల్ ఫ్యాన్స్‌కు అలెర్ట్: వీఐపీ పాస్‌ల పేరుతో సైబర్ కేటుగాళ్ల గాలం

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు అలెర్ట్: వీఐపీ పాస్‌ల పేరుతో సైబర్ కేటుగాళ్ల గాలం

ఐపీఎల్ టికెట్ల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయని క్రికెట్ అభిమానులను టీజీసీఎస్బీ (TGCSB) అప్రమత్తం చేసింది.సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా.. VIP, VVIP పాస్‌లు ఇప్పిస్తామంటూ, భారీ డిస్కౌంట్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు మాయాజాలం చేస్తున్నారు. మ్యాచ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ "లాస్ట్ మినిట్ టికెట్ ఆఫర్స్" అంటూ అమాయక ఫ్యాన్స్‌ను బురిడీ కొట్టిస్తున్నారు.

  • ఐపీఎల్ అధికారిక టికెట్ బుకింగ్ భాగస్వామి డిస్ట్రిక్ట్ (District) యాప్ మాత్రమే. మరే ఇతర యాప్స్ లేదా వ్యక్తులను నమ్మకండి.
  • వ్యక్తిగత యూపీఐ ఐడీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దు.
  • తక్కువ ఫాలోవర్లు ఉన్న కొత్త సోషల్ మీడియా పేజీలు, అపరిచిత వెబ్‌సైట్‌ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
  • డబ్బు మొత్తం ముందుగానే చెల్లించమంటే అది 99 శాతం మోసమని గ్రహించండి. టికెట్లు కొనే ముందు వెబ్‌సైట్ URL కరెక్ట్‌గా ఉందో లేదో సరిచూసుకోండి.
  • గుర్తుంచుకోండి.. మీ OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయండి లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి.