
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీఆర్‌జేసీ సెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 23వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ రమణకుమార్ వెల్లడించారు. http://tgrjc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు.
ఇప్పటి వరకూ 60వేలకు పైగా దరఖాస్తులు అందాయని చెప్పారు. గురుకుల విద్యాసంస్థ పరిధిలో 35 కాలేజీలున్నాయని..వాటిలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు చేయనున్నట్టు తెలిపారు. మే 10న టీజీఆర్‌జేసీ సెట్ ఎగ్జామ్ ఉంటుందని, పరీక్షకు వారం రోజుల ముందు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని రమణకుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.