మరోసారి ఆర్టీసీ కార్గోలో అన్ క్లెయిమ్ ఐటమ్స్ వేలం

మరోసారి ఆర్టీసీ కార్గోలో అన్ క్లెయిమ్ ఐటమ్స్ వేలం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను మరోసారి అధికారులు వేలం వేస్తున్నారు. జేబీఎస్ లోని ప్లాట్​ఫారం నెం.14 పక్కన ఉన్న కార్గో కార్యాలయంలో  ఈ నెల14 నుంచి 16 వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం నిర్వహించనున్నారు. ఎవరైనా నేరుగా వచ్చి వేలం పాటలో పాల్గొనవచ్చని గ్రేటర్​ హైదరాబాద్​జోన్​ అసిస్టెంట్​ట్రాఫిక్​ మేనేజర్​ఇషాక్​బిన్​మహ్మద్​తెలిపారు. 

పార్శిల్ వ్యాల్యూపై 50 శాతం తగ్గించి వేలం వేస్తామని, ఈసారి మొత్తం 350 ఉత్పత్తులను వేలం వేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో ఆటోమొబైల్స్​ఐటమ్స్​ 40, ఎలక్ట్రికల్​ఐటమ్స్​35, సాలిడ్​ఐరన్ 30, గృహోపకరణాలు 10, స్టేషనరీ 5, ఇండస్ట్రియల్​స్పేర్స్​10, జనరల్​ ఐటమ్స్​220 ఉన్నాయన్నారు.