
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ మెట్రోఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్ పాస్ లు తీసుకున్నవారు మెట్రో డీలక్స్ లో ప్రయాణించేందుకు గ్రేటర్ ఆర్డీసీ వెసులుబాటు కల్పించింది. ఇందుకు రూ.20 కాంబీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మెట్రో ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్ పాస్ లు తీసుకున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాంబీ టికెట్ చివరి స్టాప్ వరకు పనిచేస్తుందన్నారు.