సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన

సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన

ఏక్నాథ్ షిండేతో కూడిన శివసేన రెబల్ ఎమ్మెల్యేల వర్గాన్ని  ప్రభుత్వ ఏర్పాటుకు మహారాష్ట్ర గవర్నర్  ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ  ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  అసెంబ్లీ కొత్త స్పీకర్ ఎంపిక చేపట్టడాన్ని కూడా సవాల్ చేసింది. అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో అనర్హత అభియోగాలను ఎదుర్కొంటున్న 16  మంది రెబల్ ఎమ్మెల్యేలు ఓటు వేసినందున అది చట్టపరంగా చెల్లదని పిటిషన్ లో శివసేన పేర్కొంది.

జూన్ 30న ఏక్ నాథ్ షిండే సీఎంగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జులై 4న జరిగిన బలపరీక్షలో  బీజేపీ మద్దతుతో శివసేన రెబల్ వర్గం 164  ఓట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. 99  మాత్రమే వ్యతిరేక ఓట్లు పోలయ్యాయి.