V6 News

Thalapathy Vijay 70: విజయ్-వెట్రిమారన్ కాంబో ఫిక్సా? దళపతి కొత్త మూవీపై సంచలన టాక్!

Thalapathy Vijay 70: విజయ్-వెట్రిమారన్ కాంబో ఫిక్సా? దళపతి కొత్త మూవీపై సంచలన టాక్!

దళపతి విజయ్ నుంచి మరో సినిమా వస్తుందని కోలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి. డైరెక్టర్ హెచ్. వినోథ్ తెరకెక్కించిన జన నాయగన్ మూవీనే చివరి చిత్రంగా విజయ్ ప్రకటించారు. అయినప్పటికీ, మరో సినిమా (Thalapathy 70) కూడా రాబోతుందంటూ కొత్త టాక్ మొదలైంది.

అయితే, ఈ చిత్రం సెన్సార్, కోర్టు చిక్కుల్లో కొట్టుమిట్టాడుతుంది. జనవరి 9న విడుదల కావాల్సింది. కానీ, నాలుగు నెలలు గడిచిన రిలీజ్ కాలేకపోతుంది. దానికితోడు థియేటర్ రిలీజ్ కంటే ముందుగానే లీకుల బెడదతో చిత్ర బృందం మరింత నష్టపోతుంది 

ఈ సమయంలోనే విజయ్, జననాయగన్ నిర్మించిన కేవీఎన్ నిర్మాణ సంస్థతో మరో సినిమాను చేస్తున్నట్లుగా టాక్. అయితే, ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కేవీఎన్ ఫేస్ చేస్తున్న సమస్యలను, వచ్చిన నష్టానికి బదులుగా విజయ్ ఇంకో సినిమా చేయడమే కరెక్ట్ అని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 

విజయ్–వెట్రిమారన్ కాంబినేషన్?

దళపతి విజయ్ రాజకీయ నాయకుడిగా బిజీగా ఉన్నప్పటికీ, మరో మూవీలో నటించాలని ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా అనేది క్లారిటీ లేనప్పటికీ.. టాక్ మాత్రం సినీ వర్గాల్లో దూసుకెళ్తోంది.

మరి ముఖ్యంగా సామాజిక చిత్రాలతో కట్టిపడేసే వెట్రిమారన్తో, విజయ్ సినిమా వస్తుంది అంటేనే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయని సినీ ఆడియన్స్ అంటున్నారు. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ దద్దరిల్లడం మాత్రం కన్ఫామ్ అని చెప్పొచ్చు. తమిళనాడు అసెంబ్లీ ఎలెక్షన్స్ పూర్తయ్యాక దీనిపై ఆలోచించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, ఇవన్నీ ఇప్పటికీ కేవలం ఊహాగానాలే. అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయక తప్పదు.

గతంలో విజయ్, వెట్రిమారన్ కలిసి ‘తలపతి 69’ ప్రాజెక్ట్‌పై పనిచేస్తారనే రూమర్స్ వినిపించాయి. అయితే, ఆ ప్రాజెక్ట్‌తో తనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వెట్రిమారన్ స్వయంగా ఖండించారు. అయినప్పటికీ, ఈ ఇద్దరూ కలిసి పని చేసే అవకాశంపై రూమర్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కొత్త టాక్ మొదలైందా? లేదా విజయ్ పొలిటికల్ కెరీర్ పరంగా హెల్ప్ అవుతుందని సెట్ అయిందా? అనేది తెలియాల్సి ఉంది. 

ప్రస్తుతం వెట్రిమారన్.. నటుడు సూరితో 'విడుదలై 3' , అలాగే సూర్యతో ' వాడివాసల్' , ధనుష్‌తో ' వడ చెన్నై 2' చిత్రాలకు కమిట్ అయి ఉన్నారు. అందువల్ల ఈ బిజీ షెడ్యూల్ మధ్య విజయ్‌తో సినిమా ఉంటుందా? లేదా అనేది కూడా సస్పెన్స్గా మారింది. 

సెన్సార్ చిక్కులు.. కోర్టు మెట్లు!

దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పొలిటికల్ కంటెంట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని తెలుస్తోంది. జనవరి 9, 2026న విడుదల కావాల్సిన ఈ చిత్రం, సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల ఆగిపోయింది. బోర్డు సభ్యులతో వివాదం తలెత్తడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ చిత్రం రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉంది.  ప్రస్తుతం తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ తరుణంలో విజయ్ సినిమా విడుదలైతే అది ఓటర్లపై ప్రభావం చూపుతుందని, అందుకే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.