మహారాష్ట్రలోని ఓ అపార్టుంట్లో అగ్ని ప్రమాదం..పరుగులు పెట్టిన జనం 

మహారాష్ట్రలోని ఓ అపార్టుంట్లో అగ్ని ప్రమాదం..పరుగులు పెట్టిన జనం 

మహారాష్ట్రలోని థానేలో అగ్నిప్రమాదం జరిగింది. గోఖలే మార్గ్ లోని అర్జున్ టవర్ లో శనివారం (జూన్ 22) తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అపార్టుమెంట్ లోని ఒకటవ అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు భారీ ఎత్తున్న దట్టమైన పొగలు భవనంతోపాటు ఆ ప్రాంతమంతా అలముకున్నాయి. ఓ వైపు వర్షం పడుతున్నప్పటికీ మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.