కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామ రక్ష : కేటీఆర్

కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామ రక్ష : కేటీఆర్

ప్రతిపక్షమంటే పక్షపాతంగా వ్యవహరించాలని, ఎప్పుడూ విమర్శ చేయాలనుకోవడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. మంచి చేసినపుడు అప్పుడప్పుడైనా సమర్థించాలని అన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న కేటీఆర్.. దేశానికి రాష్ట్రం ఆదర్శనంగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వంలో పైరవీకారులకు చోటు లేదని, పథకాల కోసం లబ్దిదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి సాధించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి సమస్య తీరిపోయిందని, నిధుల వరద పారుతోందని, నియామకాల కల కూడా సాకారమవుతోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అనుమానాలను పటాపంచెలు చూస్తూ తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

కేసీఆర్ హయాంలో పల్లెలు అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయని, గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నిజమవుతోందని కేటీఆర్ అన్నారు. దేశంలో అభివృద్ధిచెందిన 20 గ్రామాల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయన్న ఆయన.. తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని చెప్పారు. 75ఏండ్లలో ఏ నాయకుడు చేయని అభివృద్ధిని కేసీఆర్ చేస్తుండని, అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని ఆయన నాయకత్వం కోరుకుంటోందని అన్నారు. రైతే పాలకుడైతే పాలన ఎలా ఉంటుందనడానికి తెలంగాణే నిదర్శమని కేటీఆర్ చెప్పారు.