సపోర్ట్ చేసిన నా తమ్ముడు ఎన్టీఆర్‌‌‌‌కి థ్యాంక్స్‌‌

సపోర్ట్ చేసిన నా తమ్ముడు ఎన్టీఆర్‌‌‌‌కి థ్యాంక్స్‌‌

కళ్యాణ్​రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ‘బింబిసార’ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సక్సెస్ సెలెబ్రేషన్‌‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో  కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘ఇంత మంచి విజయాన్నిచ్చినందుకు ఇండస్ట్రీ మొత్తం ప్రేక్షకులకు రుణపడి ఉంటాం. మా అందరికీ ఊపిరి పోశారు. మంచి కంటెంట్ ఇస్తే కచ్చితంగా థియేటర్స్ కు వస్తామని ప్రూవ్ చేశారు. ఈ సక్సెస్‌‌లో మా టీమ్ మొత్తానికి భాగముంది. ముఖ్యంగా తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌‌తో కీరవాణి సినిమాకి లైఫ్ ఇస్తే,  అద్భుతమైన విజువల్స్‌‌తో  చోటా కె నాయుడు మరో లెవెల్‌‌కి తీసుకెళ్లారు.

ఎడిటింగ్ విషయంలో తమ్మిరాజు చాలా సపోర్ట్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ అద్భుతమైన సెట్స్ వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఫైట్స్‌‌ గురించి కూడా బాగా చెబుతున్నారు. బింబిసారుడు అనే గొప్ప క్యారెక్టర్‌‌‌‌ని నేను చేయగలనని నాకంటే ఎక్కువ నమ్మాడు వశిష్ట. శ్రీనివాస రెడ్డి, కేథరీన్ థ్రెసా, సంయుక్తా మీనన్, ప్రకాష్​రాజ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్‌‌గా చేసిన పాప కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అందరికంటే ముందు ఈ సినిమాని చూసి నన్ను సపోర్ట్ చేసిన నా తమ్ముడు ఎన్టీఆర్‌‌‌‌కి థ్యాంక్స్‌‌’ అన్నాడు. మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పిన వశిష్ట... ఈ విజయంతో పార్ట్‌‌2 విషయంలో తన బాధ్యతను మరింత పెంచారన్నాడు.  మూవీ టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.