థానోస్ టెక్నాలజీ ప్రొడక్షన్​ యూనిట్​ ప్రారంభం

థానోస్ టెక్నాలజీ ప్రొడక్షన్​ యూనిట్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: స్ప్రేయర్​ డ్రోన్ల (పురుగుల మందు చల్లేవి) తయారీ సంస్థ థానోస్ టెక్నాలజీస్ తమ ఆఫీస్​తోపాటు  ప్రొడక్షన్ ఫెసిలిటీని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జీడిమెట్లలో ప్రారంభించింది. ఈ వ్యూహాత్మక విస్తరణ థానోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక ముఖ్యమైన మైలురాయని కంపెనీ ప్రకటించింది. వినూత్న డ్రోన్ టెక్నాలజీలతో వ్యవసాయానికి మేలు చేయడం తమ లక్ష్యమని ప్రకటించింది.  

ఈ ఫెసిలిటీలో ఏటా మూడు వేల యూనిట్లను తయారు చేయవచ్చు. క్రమంగా ఫ్యాక్టరీని మరింత విస్తరిస్తామని తెలిపింది. గత ఆరు నెలల్లో, థానోస్ దాని ఉద్యోగుల సంఖ్యను భారీగా పెంచింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాము అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకంగా ఆగ్నేయాసియా,  ఆఫ్రికాలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని థానోస్  ఫౌండర్​ ప్రదీప్ పలెల్లి తెలిపారు