
‘పెళ్లి చూపులు’ ఈ నగరానికి ఏమైంది మూవీస్ తో మ్యాజిక్ చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). మళ్ళీ డైరెక్టర్ గా ‘కీడా కోలా మూవీతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ పోస్టర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ డిఫరెంట్ కథాంశంతో రాబోతుందని సమాచారం.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను నేడు (జూన్ 28) చిత్ర యూనిట్ విడుదల చేసింది. కీడా కోలా టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ మూవీలో బ్రహ్మానందం(Brahmanandam) , 30 Weds 21 ఫేమ్ చైతన్య రావు(Chaitanya Rao) కీ రోల్ పోషిస్తునారు.
టీజర్ లో బ్రహ్మానందం కనిపిస్తూ సెటైరికర్ వేసే డైలాగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. “ఏంట్రా అది” అని బ్రహ్మానందం అంటే.. ‘గ్రేప్స్ ఏమో’ అని అంటాడు చైతన్య. “గ్రేప్సా.. ఎలా బతికావురా ఇన్నాళ్లు నువ్వు” అని బ్రహ్మానందం డైలాగ్ చెబుతాడు. “నువ్వు.. . నువ్వు బతుకుతలేవా.అట్లనే” అంటాడు చైతన్య. చివర్లో కోలా లోంచి బొద్దింక పైకి ఎక్కడానికి తెగ ట్రై చేస్తున్నట్లు చూపించాడు డైరెక్టర్.
ALSO READ:"ఎలా బతికావురా ఇన్నాళ్లు..నువ్వు బతుకుతలేవా అట్లనే”.. ‘కీడా కోలా' టీజర్
వీరి మధ్య సాగే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ ఉండేలా టీజర్ కట్ పడింది. ఇక ఈ మూవీ లో తరుణ్ భాస్కర్ నటిస్తుండగా “శ్వాస మీద ధ్వాస.. ఒస్తున్నాం " అంటూ టీజర్ చివర్లో హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. టీజర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది.ఈ మూవీకి వివేక్ సాగర్(Vivek Sagar) సంగీతం అందిస్తున్నాడు.