వర్ష సూచన : మరో మూడు గంటల్లో మోస్తారు వర్షాలు

వర్ష సూచన : మరో మూడు గంటల్లో  మోస్తారు వర్షాలు

రాష్ట్రంలో రానున్న మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, యాదాద్రి, భువనగిరి, మెదక్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, జనగాం, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

ఇటీవల కాలంలో కురుస్తోన్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా..ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వేల ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. హైదరాబాద్ లో జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  ఇక మూసీ ఉగ్రరూపంతో లోతట్లు ప్రాంతాలు నీట మునిగాయి.