ఐజ్వాల్ లో 10వ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 2022

ఐజ్వాల్ లో 10వ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 2022

ఈశాన్య టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశలో ఐజ్వాల్ వేదికగా 10వ ఐటీఎం సదస్సు నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యాటక పండుగ జరగనుంది. ఈ సదస్సులో కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ టూరిజం మార్కెట్ లో ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలను హైలేట్ చేయడమే లక్ష్యంగా కేంద్ర పర్యాటక శాఖ 10వ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్(ఐటీఎం) 2022 నిర్వహిస్తోంది. మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యాటక పండుగ సాగనుంది. ఇవాళ ఈ మార్ట్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పర్యాటక శాఖ మంత్రులు, పలు రాష్ట్రాలకు చెందిన టూరిజం, హాస్పిటాలిటీ అసోసియేషన్‌ల ప్రతినిధులు పాల్గొననున్నారు.

జీ 20 ప్రెసిడెన్సీని ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ టూరిజం ట్రాక్ జీ20 ప్రాధాన్యతలపై దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ ఒక ప్రకటనలో  తెలిపింది. ఐజ్వాల్ సమీపంలోని అందమైన పర్యాటక ప్రాంతాలు, పొటెన్షయల్ ఏరియా, కల్చరల్ ఈవినింగ్స్ ను ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు ఈ మార్ట్ లో ప్రదర్శించనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హోటల్స్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో బీ2బీ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే రాష్ట్రాలు తమ పర్యాటక ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు.