చైనాలో మిన్నంటిన ఆందోళనలు

చైనాలో మిన్నంటిన ఆందోళనలు

చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభలు బీజింగ్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడోసారి జీ జిన్ పింగ్ ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మావో జెడాంగ్ తర్వాత తిరిగి అంతటి శక్తివంతమైన నేతగా జిన్ పింగ్ ను ప్రతిష్టించడమే చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభలు కొనసాగుతున్నాయి. ఈనెల 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని చైనా కమ్యూనిస్టు నేతలు తెలిపారు. ఇటు పార్టీపై, అటు అధికార పీఠంపై ఏక కాలంలో తన పట్టును నిలుపుకునేందుకు ఈ మహాసభల్ని వేదికగా చేసుకోనున్నారు జిన్ పింగ్. వరుసగా మూడో సారి రెండు పదవులు చేపట్టి రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిపై సమావేశంలో చర్చిస్తారు. 

ఈ సమావేశాల్లో జిన్ పింగ్ మినహా.. ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ తో పాటు.. సీనియర్ నాయకులంతా రాజీనామా చేస్తారు. ఆ స్థానాల్లో కొత్తవారి నియామకాలు జరుగుతాయి. పార్టీ ఇకపై అనుసరించాల్సిన సైద్ధాంతిక పంథా, వ్యూహపరమైన దృక్పదాన్ని మహాసభల్లో ఆమోదిస్తారని సీపీసీ ప్రతినిధి తెలిపారు. 

మహాసభలో జరుగుతున్న నేపథ్యంలో చైనాలో ఆందోళనలు కలకలం రేపుతున్నాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజింగ్ లోని విశ్వవిద్యాలయాల్లో బ్యానర్లు ప్రదర్శించారు. జీరో కోవిడ్ వద్ద.. కావాల్సింది సంస్కరణలు..మేము పౌరులం, బానిసలం కాదు అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. దీంతో పోలీసులు బీజింగ్ లో భద్రత కట్టుదిట్టం చేశారు.