New Oscar Rules: ఏఐ చిత్రాలకు ఆస్కార్‌.. కొత్త నియమాలను వెల్లడించిన అకాడమీ..

New Oscar Rules: ఏఐ చిత్రాలకు ఆస్కార్‌.. కొత్త నియమాలను వెల్లడించిన అకాడమీ..

సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'ఆస్కార్ అవార్డులు' (2026) వివరాలను అకాడమీ వెల్లడించింది.

ఈ సందర్భంగా 98వ అకాడమీ అవార్డుల కోసం 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' కీలక వివరాలను ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 2026 మార్చి 15న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుందని తెలిపింది. 

ఈ సందర్భంగా 98వ అకాడమీ అవార్డుల కోసం 'అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్' కొత్తగా ఆమోదించబడిన నియమాలను తెలిపింది. దాంతో పాటు ప్రచార ప్రమోషనల్ నిబంధనల యొక్క విస్తృత జాబితాను (2025 ఏప్రిల్ 21) సోమవారం నాడు విడుదల చేసింది.

ఆస్కార్‌ కోసం పోటీ పడనున్న చిత్రాల జాబితాను 2026 జనవరి 22న ప్రకటించనున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. అలాగే, ఈ అవార్డుల కోసం పోటీ పడనున్న ప్రతి సినిమాను అకాడమీ సభ్యులు తప్పకుండా చూస్తారని తెలిపింది.

అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)టెక్నాలజీలను ఉపయోగించి క్రియేట్ చేయబడిన సినిమాలకు కూడా అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ స్పష్టం చేసింది. అయితే, ఇది మిగతా అవార్డులకు పోటీకాదని, సాంప్రదాయ చిత్రాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఉంటుందని అకాడమీ వెల్లడించింది. 

అలాగే, మొదటిసారిగా.. అకాడమీ "అచీవ్‌మెంట్‌ ఇన్‌ కాస్టింగ్‌" అనే కొత్త కేటగిరీని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ కేటగిరీకి రెండు దశల్లో ఓటింగ్‌ ప్రక్రియ ఉండనున్నట్లు వెల్లడించింది. ఫైనల్ ఓటింగ్ ముందు కాస్టింగ్‌ డైరెక్టర్లకు కొన్ని రౌండ్ల టెస్టింగ్ ఉంటుందని అకాడమీ వెల్లడించింది.