
హైదరాబాద్, వెలుగు: కీసర తహసీల్దార్ నాగరాజు టైపిస్ట్‌గా జాయిన్ అయిన నాటి నుంచి కూడబెట్టిన అక్రమాస్తుల వివరాలను ఏసీబీ సేక రిస్తోంది. ఇందులో భాగంగా నాగరాజుతోపాటు వీఆర్‌ఏసాయిరాజ్, సత్య డెవలపర్స్ ప్రతినిధి శ్రీనాథ్, రియల్‌ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డిని కస్ట డీలోకి తీసుకుని విచారించనుంది. వీరిని 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సోమవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నాయి. అంజిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కీసర మండలం రాంపల్లిదయారాలోని అంజిరెడ్డి ఇంట్లో సోమవారం ఏసీబీ సోదాలు చేసింది. డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు టీమ్ రెండు గంటల పాటు తనిఖీలు చేసింది. ఈ కేసులో కీలకంగా మారిన 19 ఎకరాల 39 గుంటలకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు ఓ పార్టీఎంపీకి అంజిరెడ్డికి మధ్య ఉన్న వ్యాపార లావాదేవీల వివరాలను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు నాగరాజుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనుంది. ఇందుకోసం హైదరాబాద్, వరంగల్ లో నాగరాజుకు సంబంధించి న ఆస్తుల డాక్యుమెంట్లను సేకరించినట్లుతెలిసింది. అల్వాల్‌లోని నాగరాజు ఇల్లు, కారులో స్వాధీనం చేసుకున్న రూ.36 లక్షల వివరాలను రాబడుతోంది. మరికొందరు బాధితులు నాగరాజుపై ఏసీబీకి ఫిర్యాదులు ఇస్తున్నారు .