పాలన చేతకాక రోడ్లపైకి వచ్చి ధర్నాలు, డ్రామాలు

పాలన చేతకాక రోడ్లపైకి వచ్చి ధర్నాలు, డ్రామాలు
  • పేదల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం
  • ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఆదిలాబాద్ జిల్లా: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పాలన చేతకాక రోడ్లపైకి వచ్చి ధర్నాలు, డ్రామాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వినోభా భావే భూదాన్ ఉద్యమం ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదప్రజల భూములను దౌర్జన్యంగా లాక్కుంటోందన్నారు. పొడుభూములను లాక్కొని కార్పోరేట్ సంస్థలకు అప్పగిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ, పేదల భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పేదల భూములు లాక్కుని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేయడం దారుణం అన్నారు. చాయ్ అమ్ముకొని జీవించి జీవితంలో ఎంతో పైకొచ్చిన ప్రధాని మోడీ..  రైల్వే ఫ్లాట్ ఫారాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. పొడుభూములకు పట్టాలిస్తామని దరఖాస్తులు తీసుకొని మూలనా పడేశారని.. ఇప్పుడు అదే భూముల్లో మొక్కలు నాటుతున్నారని ఆమె ఆరోపించారు. పేదలకు ఇచ్చిన భూములను ధరణిలో చేర్చి పట్టాలివ్వాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి

ఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా

ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ కూల్చివేత

గవర్నర్ ప్రోటోకాల్ పై కేంద్ర హోంశాఖ సీరియస్..?

తమిళిసైకి కాదు.. రాజ్ భవన్కు అవమానం

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అమిత్ షా, మోడీ అసంతృప్తి