
రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. చెప్పిందే చేస్తాము చేసేదే చెబుతామనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. మొదటి విడతలో లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేశామని తెలిపారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయని విమర్శించారు.
రైతు ఆదాయం పెరగడానికి ఆయిల్ ఫామ్ సాగు తోడ్పడుతుందని అన్నారు. రూ.170 కోట్ల వ్యయంతో పెద్దరాత్ పల్లిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 250 మందికి ప్రతేక్షంగా 500మందికి పరోక్షంగా ఉపాధి పొందుతారని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి టేలండ్ ప్రాంత రైతులకు నీరు అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.