పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ 

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ 

ఢిల్లీ : కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలకు సహకరించాల్సిందిగా అన్ని పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. టీఆర్ఎస్ తరపున పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, జేడీఎస్ నుంచి ఎంపీ దౌవెగౌడ హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ఇవాళ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగే బిజినెస్ అడ్వైజరీ మీటింగ్ లో అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో చర్చించాల్సిన అంశాలు, కీలక బిల్లులకు సమయం కేటాయింపు వంటి కీలక అంశాలపై బిజినెస్ అడ్వైజరీ మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నారు.