
మొలకెత్తిన గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మంచివి. బ్రేక్‌ఫాస్ట్‌గా, స్నాక్‌గా వీటిని తింటే తొందరగా ఆకలి వేయదు. బరువు తగ్గడానికి, ఆహారం ఈజీగా జీర్ణం అయ్యేందుకు వీటిలోని ఫైబర్ సాయపడుతుంది. అయితే, కొన్నిసార్లు మొలకలు సరిగా రావు. మొలకలు బాగా రావడానికి చెఫ్ మేఘనా కమ్దార్ చెబుతున్న టిప్స్ ఇవి...
ముందుగా పెసలు లేదా శనగల్ని శుభ్రంగా కడిగి, మూడు గంటలు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత నీళ్లు ఒంపేసి, వాటి మీద మూత పెట్టాలి. నానబెట్టిన పెసలు, శనగల్ని స్టెయినర్లో పెట్టి, రాత్రంతా వెచ్చగా ఉంచినా, మైక్రోవేవ్ లేదా ఓవెన్లో ఉంచినా మొలకలు బాగా వస్తాయి.