ఢిల్లీలో యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డ లవర్

ఢిల్లీలో యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డ లవర్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌‌లో దారుణం జరిగింది. తనతో బ్రేకప్ చేసుకుందని పట్టపగలు ఓ యువతిని కత్తితో పొడిచాడో యువకుడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతోందని పోలీసులు వెల్లడించారు. నార్త్ ఢిల్లీకి చెందిన యువతి(21) సుఖ్విందర్(22) అనే యువకుడు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. ఇంట్లో తెలియడంతో యువతి, సుఖ్విందర్​ను దూరం పెట్టిందన్నారు. దాంతో సోమవారం మధ్యాహ్నం ఆదర్శ్ నగర్‌‌లోని యువతి ఇంటికి సుఖ్విందర్ వెళ్లాడని చెప్పారు. ఎవరూ లేని వీధిలోకి ఆమెను తీసుకెళ్లి.. కలిసుందామని బ్రతిమిలాడినట్లు వివరించారు. యువతి అంగీకరించకపోవడంతో ఆమెను కత్తితో పొడిచి పారిపోయాడని వెల్లడించారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఫుటేజీ ఆధారంగా పోలీసులు హర్యానాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.