సమాజ్ వాదీ పార్టీ నేతనే ఆ దాడి చేసింది : బీజేపీ ఎంపీ

సమాజ్ వాదీ పార్టీ నేతనే ఆ దాడి చేసింది : బీజేపీ ఎంపీ

ఉన్నావ్ రేప్ కేస్ బాధితురాలిపై జరిగిన దాడిని లోక్ సభలో ప్రస్తావించారు కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురీ. కార్ యాక్సిడెంట్ లో బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్నారన్నారు. తండ్రి చనిపోయిన విషయం సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని… హోంమంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుగుతోందన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ. దీనిని రాజకీయం చేయొద్దని కోరారు. యాక్సిడెంట్ చేసిన లారీ సమాజ్ వాదీ పార్టీ నేతదని ఆరోపించారు బీజేపీ ఎంపీ జగదంబికా పాల్.