దెయ్యాలున్నాయని స్కూల్ కూల్చేసిండ్రు

దెయ్యాలున్నాయని స్కూల్ కూల్చేసిండ్రు

దెయ్యాలున్నాయని స్కూల్ కూల్చేసిండ్రు
ఒడిశాలో బహనగా స్కూల్ బిల్డింగ్ నేలమట్టం 
రైలు ప్రమాద మృతదేహాలను ఉంచడమే కారణం
భయంతో బడికి రాలేమన్న టీచర్లు, విద్యార్థులు

బాలాసోర్ : ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతదేహాలను ఉంచిన స్కూల్​ను ఇవాళ అధికారులు కూల్చివేశారు. ఈ దుర్ఘటనను తలుచుకొని ఇప్పటికీ స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. డెడ్​బాడీలను బహానగా ప్రభుత్వ స్కూల్లో భద్రపరిచిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో సెలవులు పూర్తవుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూలుకు వెళ్లాలంటే భయపడుతున్నారు.  శవాలను ఉంచిన క్లాస్​రూంలను చూసి వణికిపోతున్నారు. 

దెయ్యాల భయంతో కొందరు..  శవాల కుప్పల దృశ్యాలను చూసి చెలించిన వారు మరికొందరు..! స్కూలుకు పిల్లల్ని పంపేందుకు నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ స్కూల్​ ప్రిన్సిపాల్​ ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇవాళ కలెక్టర్​ దత్తాత్రేయ శిండే ఆదేశాలతో ఆ బడి భవనాన్ని కూల్చివేశారు. స్కూల్​ భవనం పాతదైపోవడం, దీనిని డెడ్​బాడీల కోసం కేటాయించడం వంటి కారణాలు చూపుతూ.. కొత్త భవనం నిర్మించనున్నారు.