కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు వీడియో ఇదేనా..?

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు వీడియో ఇదేనా..?

ఒడిశాలోని బాలేశ్వర్ రైలు ప్రమాదం దుర్ఘటన వేలాది మంది జీవితాల్లో చీకట్లు నింపింది. ఆ పెను విషాదం నుంచి బాధితులు ఇంకా తేరుకోవడం లేదు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఆ షాక్ నుంచి తేరుకోవడం లేదు. ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లో తీసిన వీడియో ఇదేనంటూ ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఒడిశాలో జూన్‌ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే.. ప్రమాదానికి ముందు వీడియో అంటూ ఒకటి వైరల్‌ అవుతోంది. అందులో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌గా చెప్తున్న రైలులో..  రైల్వే సిబ్బంది కోచ్ ఫ్లోర్ ను శుభ్రం చేస్తున్నాడు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ప్రయాణికులు ప్రశాంతంగా కొందరు పడుకోగా.. మరికొందరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరో తన మొబైల్‌లో అదంతా రికార్డు చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. అందరూ గట్టిగా అరుస్తూ.. కేకల వేయడం వినిపిస్తోంది. హాహాకారాలతో ఉన్న వీడియో అసంపూర్తిగా ఆగిపోయింది. ఈ వీడియోనే కోరమాండల్‌ ప్రమాద వీడియో అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. 

కానీ, ఇది ఒడిశా రైలు ప్రమాదానికి చెందినదా.. ? కాదా..? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైల్వేశాఖ, ఒడిశా అధికార యంత్రాంగం దీనిపై స్పందించాల్సి ఉంది. ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

ఇప్పటికీ 82 మంది మృతదేహాలను గుర్తించాల్సి  ఉంది. డెడ్ బాడీలు పాడైపోయే అవకాశం ఉండడంతో వీలైనంత త్వరగా వాటిని బంధువులకు అప్పగించే ప్రయత్నంలో అధికారులు తలమునకలయ్యారు. డీఎన్‌ఏ టెస్టులు సహా చివరి ఆప్షన్‌గా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ని  ఉపయోగించాలని నిర్ణయించారు.

https://twitter.com/DilipRaoG/status/1666667636963561472