ఎలుగుబంటిని భయపెట్టిన అద్దం

ఎలుగుబంటిని భయపెట్టిన అద్దం

అడవిలో సంచరించే జంతువుల వీడియోలు చూస్తే మనకు ఫన్నీగా అనిపిస్తుంది. వాటి హావభావాలు.. చిలిపి చేష్టలు చూస్తే ఆటోమెటిక్గా నవ్వొస్తుంది. ఇక అద్దాన్ని  చూసి ఆశ్చర్యపోయి జంతువులు  చేసే వింత ప్రవర్తన చూస్తే కడుపు చెక్కలవ్వాల్సిందే. తాజాగా అలాంటి వీడియో సోషల్‌ మీడియాలో  వైరలవుతోంది.
  
అడవుల్లోని స్తంభంపై అమర్చినట్లుగా కనిపించే అద్దం..అటువైపు వెళ్తున్న  ఓ  ఎలుగుబంటి దృష్టిని ఆకర్షిస్తుంది. తొలిసారి అద్దాన్ని చూసిన ఎలుగుబంటి..అందులో  తన ప్రతిబింబాన్ని చూసుకుని  ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది.  పక్కకు జరిగి మళ్లీ అద్దంలో తననుత తాను చూసుకుంటుంది.  ఇక్కడ ఇంకేదో జంతువు ఉందనే భయంతో మరో సారి అద్దంలో చెక్‌ చేసుకుంటుంది. వెనకాల ఏదో ఉందని చూసినా ఏ జంతువు కనిపించకపోవడంతో..కోపంతో అద్దాన్ని ఢీకొడుతుంది. మరో ఎలుగు బంటి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించి పట్టరాని కోపంతో అద్దాన్ని నేలకేసి కొడుతుంది.  ప్రస్తుతం ఈ  ఉల్లాసకరమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

 

ఈ వీడియోను దీనిని సోషల్ మీడియాలో 76డోరేమి అనే వ్యక్తి షేర్ చేశాడు. తన్ను తాను మొదటిసారి చూసిన తర్వాత ఎలుగుబంటి యొక్క  రియాక్షన్ అని కామెంట్ పెట్టాడు.  ఈ వీడియో షేర్ చేసిన ఒక్క రోజులో 14 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వందలాది నెటిజన్లు కామెంట్స్ చేశారు.