గాయం నుంచి కోలుకున్న విజయ్ దేవరకొండ

గాయం నుంచి కోలుకున్న విజయ్ దేవరకొండ

నటుడు విజయ్ దేవరకొండ దాదాపు 8 నెలల తర్వాత ఎట్టకేలకు 'లైగర్' గాయం నుండి కోలుకున్నాడు.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. తన ఆరోగ్యం గురించి అభిమానులకు అప్‌డేట్ చేశాడు. గాయపడిన చేతులను చూపిస్తూ.. ముఖాన్ని కవర్ చేసుకున్న ఫొటోను షేర్ చేసిన విజయ్.. 8 నెలల తర్వాత  తన గాయాలు మానినట్టు వెల్లడించాడు. చాలా కాలం తర్వాత తాను మళ్లీ డైలీ వర్క్స్ లో కష్టపడి పని చేయడానికి సిద్ధమయ్యాననే క్యాప్షన్ ను విజయ్ ఈ సందర్భంగా రాసుకొచ్చాడు. 

సినిమాల్లోకి రాకముందే విజయ్ కి షోల్డర్ ఇంజ్యూరీ అయినట్టు ఆయన ట్రైనర్ కులదీప్ సేథీ తెలిపారు. 'లైగర్' షూటింగ్ చేస్తున్న సమయంలో ఆ గాయం మళ్లీ తిరుగుముఖం పట్టిందని, దాని వల్లే విజయ్ చాలా కష్టపడాల్సి వచ్చిందని సమాచారం. అయితే తన పోస్టులో విజయ్ దేవరకొండ ఎక్కడా 'లైగర్' పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా చేస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ కశ్మీర్ వెళ్లి కొంత షూటింగ్ చేసి వచ్చారు. ప్రస్తుతం సమంత ఆరోగ్యం బాలేకపోవడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా వేశారు. 

https://www.instagram.com/stories/thedeverakonda/2967842601103082825/?hl=en