రోడ్డు మీద పడి ఉన్న కరెంటు వైరుపై వెళ్లిన బైకు.. షాక్‌తో తల్లీ కుమారుడు మృతి

రోడ్డు మీద పడి ఉన్న కరెంటు వైరుపై వెళ్లిన బైకు.. షాక్‌తో తల్లీ కుమారుడు మృతి

అనంతపురం: రోడ్డుమీద పడి ఉన్న హైటెన్షన్ కరెంటు వైరుపై వెళ్లిన బైకు ప్రమాద వశాత్తు షాక్ కు గురైంది. బైకుపై వెళ్తున్న తల్లీ కుమారులు షాక్ తో కిందపడిపోయి అక్కడికక్కడే చనిపోయారు. క్షణాల వ్యవధిలో జరిగిన ఘటన సంచలనం రేపింది. పాదచారులు ఏం జరిగిందోనని వచ్చి చూసేలోపే ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. పెద్దపప్పూరు మండలం వరదాయపాలెంకు చెందిన వెంకటలక్ష్మమ్మ (55), ఆమె కుమారుడు వెంకటస్వామి (36)తో కలసి ఉదయమే వ్యవసాయ పనులకు బయలుదేరారు. పొలాల మధ్యలో ఉన్న రోడ్డుపై  33/11కేవీ హైటెన్షన్ కరెంటు వైరు తెగిపడిపోయి ఉంది. బైకుపై వెళ్తున్న వారు కరెంటు వైరును గమనించాడో లేదో కాని.. వైరు పై నుండే బైకును పోనిచ్చాడు. బైకు కరెంటు వైరు దాటేటప్పుడు కరెంట్ షాక్ కొట్టడంతో బైకు అదుపుతప్పింది. బైకుపై వెళ్తున్న తల్లీ కొడుకులు కరెంటు షాక్ తో గిలగిలా కొట్టుకుని సజీవదహనం అయ్యారు. ఆ మార్గంలో వెళ్లే పాదచారులు గుర్తించి  సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లీ కొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి 

ఏపీలో రూ.23,500.. తెలంగాణలో రూ.15 వేలే

తెలంగాణ, ఏపీ ఇంటర్‌‌ బోర్డుల అధికారులపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ నీళ్ల లెక్క సరిదిద్దాలె.. కేఆర్ఎంబీకి తెలంగాణ లెటర్‌‌ 

ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు