ప్రశాంత్ రెడ్డికి.. జామ కాయకు, కస్టర్డ్ ఆపిల్ కు తేడా..

ప్రశాంత్ రెడ్డికి.. జామ కాయకు, కస్టర్డ్ ఆపిల్ కు తేడా..

నిజామాబాద్ శివారులోని మాధవ నగర్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆందోళన చేసింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్న ఈ ధర్నాలో... బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ తీరును తప్పుపడుతున్న టీఆర్ఎస్ నేతలపై కౌంటర్లు వేశారు అర్వింద్. టిఆర్ఎస్ MLAలు బాజిరెడ్డి గోవర్దన్, గణశ్ గుప్తా, మంత్రి ప్రశాంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. నిధుల విడుదల గురించి... ఎమ్మెల్యే బాజిరెడ్డి కోసం కేంద్రం తెలుగులో ప్రత్యేకంగా లెటర్లు పంపదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. పసుపు బోర్డు కన్నా మెరుగైన, అత్యాధునిక క్లస్టర్, టైస్ స్కీం తెచ్చానని తెలిపారు. టీఆర్ఎస్ లీడర్లు ఔట్ డేటెడ్ గా ఆలోచిస్తున్నారన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి.. జామ కాయకు, కస్టర్డ్ ఆపిల్ కు తేడా తెలియదన్నారు అర్వింద్.