కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్(CPGET) నోటిఫికేషన్‌ విడుద‌ల

కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్(CPGET) నోటిఫికేషన్‌ విడుద‌ల

‌రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో సీట్ల భ‌ర్తీకి నిర్వ‌హించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్-సీపీజీఈటీ)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి విడుద‌ల చేసింది. వీటికి సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ శుక్ర‌వారం నుంచి ప్రారంభమైంది. అధికారిక వెబ్‌సైట్‌ tscpget.com ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ సారి CPGET ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వ‌హిస్తుంది. మొత్తం 46 సబ్జెక్ట్ లలో ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణలోని అన్ని పాత జిల్లాల లో పరీక్ష నిర్వ‌హిస్తామ‌ని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సబ్జెక్ట్ లలో 30వేల సీట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ ఉమ్మ‌డి ప్ర‌వేశ‌ప‌రీక్ష ద్వారా రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలైన ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ వ‌ర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏలో ఐదేండ్ల‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల‌తోపాటు జేఎన్‌టీయూహెచ్‌లోని రెండేండ్ల ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఎంపిక విధానం: ‌రాత‌ప‌రీక్ష ద్వా‌రా (కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌)

అప్లికేషన్ చివరి తేదీ: 20-10-2020

పరీక్ష తేదీ: 31-10-2020