
హుజూరాబాద్(శంకరపట్నం): అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్జిల్లా హుజూరాబాద్ రూరల్సీఐ కిరణ్తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం ఇప్పలపల్లె గ్రామానికి చెందిన రమ్యకు పదేళ్ల క్రితం ఇదే మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గడ్డం రాజుతో వివాహమైంది. కొన్ని రోజులుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ కుటుంబసభ్యులు రమ్యను చిత్రహింసలకు గురి చేశారు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో ఒకసారి పంచాయితీ కూడా పెట్టారు. రమ్య తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె తమ్ముడు ఉన్న ఇల్లు అమ్మేసి డబ్బులు ఇచ్చాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపానికి గురై మార్చి 22న రమ్య కొడుకు శివమణి (6), కూతురు సింధు (16 నెలలు)తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రాత్రివరకు ఇంటికి రాకపోవడంతో స్థానికులతో కలిసి వెతికారు. ఎస్సారెస్పీ కాలువ వద్ద రమ్య బైక్కనిపించింది. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. సోమవారం మెయిన్కెనాల్ సింగాపూర్వద్ద రమ్య మృతదేహం, హుజూరాబాద్శివారులో సింధు మృతదేహం కనిపించాయి. శివమణి మృతదేహం ఇంకా దొరకలేదని.. గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.