సామాజిక రుగ్మతలు, దురాచారాలను రూపుమాపేది పుస్తకమే : రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్

సామాజిక రుగ్మతలు, దురాచారాలను రూపుమాపేది పుస్తకమే : రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు

ముషీరాబాద్, వెలుగు: సామాజిక రుగ్మతలు, దురాచారాలను రూపుమాపేది పుస్తకమేనని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా  మంగళవారం చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీలో పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సంఘసంస్కర్తలు, తత్వవేత్తలు, ఉద్యమ నేతలు, సైంటిస్టులతో పాటు అన్ని రంగాల్లోని గొప్ప వ్యక్తులను తయారు చేసేది పుస్తకమేనన్నారు. 

ప్రస్తుతం ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా పుస్తకం చదివేవారి సంఖ్య తగ్గలేదన్నారు. యువత లైబ్రరీలను వాడుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ సంస్థ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి, సెక్రటరీ పద్మజ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.