లండన్: అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం (జెఫ్రీ ఎప్‌స్టైన్)లో ఇరుక్కున్న తన తమ్ముడు ఆండ్రూపై బ్రిటన్ రాజు చార్లెస్ 3 కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రిన్స్ సహా ఇతర హోదాలను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఉంటున్న విండ్సర్ క్యాజిల్ ఎస్టేట్‌లోని భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈమేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
విండ్సర్ ఎస్టేట్‌లోని రాయల్ లాడ్జ్‌ను ఆండ్రూ లీజుకు తీసుకుని ఉంటున్నారు. అయితే ఆ లీజును చార్లెస్ రద్దు చేశారు. దీంతో ఆండ్రూ ఇప్పుడు సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ప్రైవేట్ అకామిడేషన్‌కు మారనున్నారు. కాగా, అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టైన్‌లో సెక్స్ కుంభకోణం పేపర్లలో ఆండ్రూ పేరు బయటకొచ్చింది.
